దేశంలో మరోసారి పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 32 పైసలు వరకు పెరగగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్ ధర రూ.103కి చేరింది. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.108.07 డీజిల్ రూ.100.82కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.93, డీజిల్ రూ.87.69కు పెరిగింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ధరలు పెరగ్గా.. పెట్రోల్‌పై రూ.6.61, డీజిల్ రూ.6.91 పెరిగింది. ఫిబ్రవరి 26న ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా.. చివరిసారిగా ఫిబ్రవరి 27న ధరలు పెరగ్గా.. ఆ తర్వాత ధరలు పెరుగలేదు.
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.100.74, డీజిల్ రూ.95.59,విజయవాడలో పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.96.97,చెన్నైలో పెట్రోల్ రూ.98.14, డీజిల్ రూ.92.31,కోల్‌కతాలో పెట్రోల్ రూ.96.84, డీజిల్ రూ.90.54గా ఉంది.