డ్యబ్లూటీసీ ఫైనల్ నేడే…

191
wtc
- Advertisement -

భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ నేటి నుండి ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకి ఈ మ్యాచ్ స్టార్ట్‌కానుండగా ఈ ఫస్ట్ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరే క్రమంలో మొత్తం ఆరు సిరీస్‌లను భారత్ జట్టు ఆడింది. సిరీస్‌ల్లో భాగంగా జరిగిన 17 మ్యాచ్‌లకిగానూ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. కేవలం నాలుగింటిలో మాత్రమే ఓడింది. విజేతకి రూ.11.67 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుండగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకి రూ.5.84 కోట్లు ఇవ్వనున్నారు.

భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, దేవాన్ కాన్వె, కొలిన్ గ్రాండ్‌హోమ్, మాట్‌ హెన్రీ, కైల్ జెమీషన్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్ (వికెట్ కీపర్), విల్ యంగ్

- Advertisement -