వెనక్కి తగ్గిన పెట్రో డీలర్లు..

182
Petrol
- Advertisement -

జనవరి 9నుంచి పెట్రోల్ బంకుల్లో కార్డు లావాదావీలకు అనుమతించబోమని చెప్పిన పెట్రో డీలర్లు..తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 13కు ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు..అప్పటివరకు కార్డులను తీసుకుంటామని ప్రకటించారు. పెట్రో బంకు యాజమాన్య ఆందోళనతో స్పందించిన బ్యాంకు అధికారులు డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి ఇంధనం తీసుకుంటే సేవా రుసుము వసూలు చేయాలన్న ఉత్తర్వులను ఆదివారం అర్ధరాత్రి తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నాయి. దీంతో 13దాకా ఆందోళనకు దిగడం లేదు అని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (ఏఐపీడీఏ) అధ్యక్షుడు అజయ్ బన్సల్ తెలిపారు.

Petrol

కార్డు లావాదేవిల వల్ల పెట్రోలియం యాజమాన్యంపై బ్యాంకులు ఒక రూపాయి వసూల్ చేస్తున్నందుకు నిరసనగా పెట్రోలు డీలర్ల ఆందోళనకు దిగారు. తమపై వేసే చార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించే వరకు కార్డులను పెట్రోల్ బంకుల్లో అనుమతించబోమని..కేవలం నగదు రూపంలోనే పెట్రోలు విక్రయిస్తామని ప్రెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈనేపథ్యంలో ఆదివారం రోజంతా ఈ అంశం ఉత్కంఠ కలిగించింది. బంకుల్లో కార్డుల ద్వారా జరిపే లావాదేవీలపై 0.25 శాతం నుంచి 1 శాతం వరకు చార్జీ వసూలు చేస్తామని బ్యాంకులు తమకు సమాచారం అందించాయని, ఇందుకు నిరసనగా సోమవారం నుంచి కార్డులు తీసుకోకూడదని నిర్ణయించామని డీలర్లు ప్రకటించారు. వినియోగదారులకు నగదు సమస్య తీర్చి సేవ చేస్తున్నందుకు తమపై అదనంగా భారం వేయడం సరికాదని పేర్కొన్నారు. పెట్రో డీలర్లు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడంతో వాహన వినియోగదారులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. మరి జనవరి 13న దీనిపై ఎలాంటి వెల్లడి వస్తుందో చూడాలి.

- Advertisement -