వరుణ్‌ తేజ్‌ పై వర్మ కామెంట్‌…

97

చిరంజీవి ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం చలరేగుతూనే ఉంది. వివాదం మొదలైన నాటి నుంచి నాగబాబుపై ట్వీట్టర్ల వర్షం కురిపిస్తున్న వర్మ..మరోసారి నాగబాబుపై విరుచుకుపడ్డాడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ ద్వారా అతన్ని విమర్శించాడు. వరుణ్ నువ్వు నీ తండ్రిని అనుసరించొద్దు అంటూ సలహా ఇచ్చేలా పోస్ట్ చేశాడు. ‘వరుణ్‌తేజ్‌ నువ్వు మీ నాన్న సలహాలు వింటే ఆయనలాగే జబర్దస్త్‌ లేకుండా తయారవుతావు.. చిరంజీవి గారి నుంచి నేర్చుకో. హే వరుణ్‌.. నీకు తెలుసు నీ సామర్థ్యాన్ని నేను ఎంతగా ఇష్టపడుతానో. దయచేసి చిరంజీవి గారిలా మీ తండ్రిని నమ్మి పొరపాటు చేయొద్దు.. లవ్యూ’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

varma

varma

దీనిపై వరుణ్ తేజ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వర్మ కామెంట్‌కు వరుణ్ ఎలా స్పందిస్తాడో నని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్మ తాజా వ్యాఖ్యలతో వివాదం రోజింత ముదురుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతన్నారు. మరి కాంట్రవర్సీ ఇక్కడితోనే ఆగుతుందో లేదో చూడాలి.

 ప్రీ రిలీజ్ వేడుకలో వర్మని టార్గెట్ చేస్తూ నాగబాబు స్ట్రాంగ్ పంచ్ లు వేశాడు. “వర్మ వాడో అక్కు పక్షి, ఆన్ లైన్లో రకరకాల కూతలు కూస్తున్నాడు. పక్షి కూతలు ఎన్నికూసినా కూడా సూపర్ హిట్ సినిమాను తొక్కలేవు.. ఫెయిల్యూర్ సినిమాను లేపలేవు” అంటూ కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. ఆ కొద్ది సేపటికే వర్మ మరో షాకింగ్ ఇచ్చాడు. ఎవరో ఈడియట్ తన ట్విట్టర్ హ్యాక్ చేశాడని, తెలుగులో ట్వీట్స్ తాను ఎప్పుడు చేయనని అన్నాడు. ముఖ్యంగా నాగబాబునే టార్గెట్ చేసుకొని వర్మ ట్వీట్ల వర్షం కురిపించాడు. ‘నాగబాబు సార్‌.. మీకు ఇంగ్లిష్‌ అర్థంకాదు.. ఎడ్యుకేటెడ్ వ్యక్తులతో నా ట్వీట్లను తెలుగులోకి అనువాదం చేయించుకోండి.. మీ సోదరునికున్న గొప్పతనంలో మీకు 0.1 శాతం కూడా లేదు. అందుకే మీలా ఆయన అనవసర వ్యాఖ్యలు చేయరు అని అన్నాడు.

మీరు నాకు సలహా ఇచ్చే ముందు, మీకు ఎలాంటి జబర్ధస్త్ కెరీర్ ఉందో ఆలోచన చేసుకోవాలన్నాడు. చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీ పెట్టించి ఎంతగా నష్టపరిచారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంటూ పలు వ్యాఖ్యలు చేశాడు. నాగబాబు గారు ఖైదీ నెం 150 ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఫెంటాస్టిక్ గా ఉంది. అవతార్ కన్నా కొద్దిగా బెటర్ అని వర్మ అన్నాడు. ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు వలన కలిగిన అసౌకర్యానికి తాను చింతిస్తున్నానని అన్నాడు. ఇక చివరిగా గుడ్ నైట్ చెబుతూ “మెగా ఫ్యామిలీకి దేవుడు పవన్, బన్నీ, చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లను ఇచ్చాడు. వారిని బ్యాలెన్స్ చేయడానికి నాగబాబు ఉన్నాడు” అంటూ కాస్త వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు వర్మ.