ఇక బంక్‌లు బంద్..

189
Petrol pumps may remain shut on Sundays
- Advertisement -

ఇక మీదట ఆదివారం రోజు మీ వెహికల్స్ లో ఆయిల్ నింపుకోవడం కుదరదు. ఎందుకంటే.. రేపు (మే నెల 14)వ తేదీ నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు బంద్ చేస్తారు. ఎనిమిది రాష్ర్టాల్లో(మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి) 20 వేల పెట్రోల్ బంక్‌లు ఆదివారం నాడు మూతపడనున్నాయి. దాంతో ఆదివారంనాడు ఆయిల్‌ నింపుకోవడం ఇక కుదరని పని.
Petrol pumps may remain shut on Sundays
నిజానికి కొన్ని సంవత్సరాల క్రితమే పెట్రోల్ ఔట్‌లెట్స్‌ను ప్రతీ ఆదివారం మూసివేయాలనుకున్నామని, అయితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల విజ్ఞప్తి మేరకు ఇంతకాలం అమలు చేయలేదని, ఇండియన్ పెట్రోలియం డీలర్స్ ఎక్స్‌క్యూటివ్ కమిటీ సభ్యుడు సురేశ్ కుమార్ చెప్పారు.
Petrol pumps may remain shut on Sundays
అంతేకాకుండా ఇటీవలే ప్రధాని చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు ఇంధన ఆదా పాటించాలన్న వ్యాఖ్యలను సైతం పరిగణలోకి తీసుకుని మే 14నుంచి ఈ ఆదివారం మూసివేత విధానం అమలు చేస్తున్నామని చెప్పారు సురేశ్ కుమార్. మామూలు పనిదినాల్లోనైతే పెట్రోల్ బంక్‌లో 15 మంది సిబ్బంది వరకు పనిచేస్తారు. ఇకపై ప్రతి ఆదివారం అత్యవసర పరిస్థితుల్లో ఉండే వాహనాలకు మాత్రమే పెట్రోల్ అందించేందుకు బంకుల్లో ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉంటారని తెలిపారు.

- Advertisement -