- Advertisement -
వినియోగదారులకు షాక్..పెట్రో మంట ఆగడం లేదు. వరుసగా ఐదో రోజు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరగడంతో లీటరు పెట్రోల్ ధర రూ.108.02కు చేరగాగ, డీజిల్ ధర రూ.100.82కి చేరింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.82 ఉండగా డీజిల్ ధర 100.29గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.84 ఉండగా డీజిల్ ధర రూ.92.47,చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.27 ఉండగా డీజిల్ ధర రూ.96.93గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.107.77 ఉండగా డీజిల్ ధర రూ.98.15గా ఉంది.
వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంధన ధరల పెంపుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సైతం ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -