వెంకీ-రానా(రానా నాయుడు)..షురూ

21
rana

టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్‌ , రానా హీరోలుగా నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు రానా నాయుడు అనే టైటిల్‌ని ఖరారు చేయగా అమెరిక‌న్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా రాబోతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్‌డేట్ బ‌య‌టకు వ‌చ్చింది. బుధవారం రానా నాయుడు షూటింగ్ మొద‌లైంది.

మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌ల‌కు ప‌ని చేసిన‌ సుప‌న్ వ‌ర్మ‌, క‌ర‌ణ్ అన్షుమాన్ ఈ షోను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం వెంకీ, రానా త‌మ త‌మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. వెంక‌టేశ్ ఎఫ్ 3లో న‌టిస్తున్నాడు. మ‌రోవైపు వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో విరాట ప‌ర్వం, సాగ‌ర్ చంద్ర డైరెక్ష‌న్‌లో భీమ్లా నాయుక్ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ బాబాయి-అబ్బాయిలు గ‌తంలో కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ చిత్రంలో క‌లిసి మెరిశారు.