- Advertisement -
వినియోగదారులకు మళ్లీ షాకిచ్చాయి చమురు కంపెనీలు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ పెట్రోల్ ధరలు పెంచుతూ వస్తున్న చమురు కంపెనీలు ఇవాళ కూడా భారీగా పెంచేశాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 26 పైసలు, లీటర్ డీజిల్ పై 33 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 82.06 కు చేరింది.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.13 కు చేరగా.. డీజిల్ ధర రూ. 89.47 కు చేరింది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర రూ. 97.86 కు చేరగా.. డీజిల్ ధర రూ. 89.17 కు చేరింది.
- Advertisement -