మాజీ డీజీపీ ప్రసాద్ రావు కన్నుమూత…

56
dgp

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాద్‌రావు మృతిచెందారు. తీవ్రమైన చాతి నొప్పి రావడంతో వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ అమెరికాలో తుదిశ్వాస విడిచారు. బి.ప్రసాదరావు 1979 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. అవినీతి నిరోధక శాఖ డీజీపీగా, హైదరాబాద్‌ సీపీ, విశాఖ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు.