పదో రోజు పెరిగిన పెట్రో ధరలు..

176
petrol
- Advertisement -

వరుసగా పదోరోజు పెట్రో ధరలు పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 34 పైసల వరకూ పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ రూ.89.88కు చేరగా రికార్డు స్థాయిలో డీజిల్‌ సైతం రూ.80 దాటింది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర రూ.93.45, డీజిల్‌ రూ.87.55కు చేరింది.

ముంబైలో పెట్రోల్ రూ.96.32కు చేరగా కోల్‌కతాలో పెట్రోల్ ఈ రోజు లీటరుకు రూ.91.11, చెన్నైలో రూ .91.98కు చేరింది. పెట్రోల్‌ ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాదిలో పెట్రోల్‌ ధర రూ.6పైగా పెరగ్గా.. ఈ నెలలో ధరలు పెరగడం 12వసారి.

- Advertisement -