పెట్రోల్ ధర పెంపుకు రంగం సిద్ధం!

120
petrol
- Advertisement -

పెట్రోల్ ధర పెంపుకు రంగం సిద్ధమైంది. లీటర్ పై రూ.12వరకు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు గణనీయంగా పెరగగా ఈ శుక్రవారం లేదా శనివారం రోజున పెట్రోల్ ధరల పెంపునకు సంబంధించిన ప్రకటన రావొచ్చని సంబంధిత వర్గాల సమాచారం.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల భయంతోనే వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరిపినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. ఇలా ముందస్తుగా వాహన ట్యాంకులను నింపుకోవడంతో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం ఒక్కసారిగా 20 శాతం పెరిగిందన్నారు.

- Advertisement -