100కు చేరవలో పెట్రోల్‌ ధర..!

208
Petrol Price
- Advertisement -

వాహనదారులకు ఇది చేదు వార్త. దేశీయ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం హైదరాబాద్‌తో పాటు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో పెట్రోల్, డీజీల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజల్‌పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించడంతో పెట్రోల్‌ ధర రూ.85కు చేరింది. వారం వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలో రూపాయికిపైగా పెరుగుదల నమోదుకావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.20, డీజిల్‌ ధర 75.38కి చేరింది. ముంబైలో పెట్రోల్‌ రేటు రూ.91.56, డీజిల్‌ రేటు 81.87గా ఉంది. ఇక హైద్రబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.63గా ఉంది.

- Advertisement -