- Advertisement -
రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తుండగా తాజాగా పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉండగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరగగా డీజిల్ ధరలు 36 పైసల నుంచి 60 పైసల మధ్య పెరిగాయి.
ముంబైలో పెట్రోల్ లీటర్కు రూ.94.93, కోల్కతాలో రూ.89.73, చెన్నైలో రూ.90.70, బెంగళూరులో రూ.91.40, హైదరాబాద్లో రూ.91.96, జైపూర్లో రూ.95.35, పాట్నాలో రూ.91.15, త్రివేండ్రం రూ.90.32కు పెరిగింది. డీజిల్ ముంబైలో లీటర్కు రూ.85.70, కోల్కతాలో రూ.82.33, చెన్నైలో రూ.83.86, బెంగళూరులో రూ.83.47, హైదరాబాద్లో రూ.85.89, జైపూర్లో రూ.87.48, పాట్నాలో రూ.84.24కు చేరింది.
- Advertisement -