పెట్రోల్ ధర రూ. 5 పెంపు..!

200
petrol price
- Advertisement -

దేశంలో రోజురోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. వరుసగా పదోరోజు పెట్రోల్ ధర పెరిగి వినియోగదారుల నెత్తిన మరింత భారం మోపుతోంది.పదిరోజుల్లో దాదాపు రూ. 5 పెరిగింది పెట్రోల్ ధర.

హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర 48 పైసలు పెరుగుదలతో రూ.79.65కు, డీజిల్ ధర 56 పైసలు పెరుగుదలతో రూ.73.49కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 47 పైసలు పెరుగుదలతో రూ.76.73కు చేరింది. డీజిల్ ధర కూడా 57 పైసలు పెరుగుదలతో రూ.75.19కు ఎగసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.08 శాతం పెరుగుదలతో 39.67 డాలర్లకు చేరింది.

- Advertisement -