- Advertisement -
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో భారత్ లో పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ పెట్రోలియం కంపెనీల కన్సార్టియం నిర్ణయం తీసుకుంది. దీంతో, లీటరు పెట్రోల్ పై 1.34 రూపాయలు పెంచగా, లీటర్ డీజిల్ పై 2.37 రూపాయలు ధర పెంచినట్టు పెట్రోలియం కంపెనీల కన్సార్టియం తెలిపింది.గతంలో ధరలు తగ్గినా ప్రభుత్వాలు ట్యాక్సుల రూపంలో వాటిని తగ్గించకపోవడానికి తోడు పెట్రోలియం కంపెనీల నిర్ణయంతో వినియోగదారుడిపై మరింత భారం పడింది. పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
- Advertisement -