వాహనదారులకు షాక్‌..

77
Petrol Price

వాహనదారులకు మరో షాకిచ్చాయి చమురు కంపెనీలు. వరుసగా రెండో రోజు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు 19 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 21 పైసలు పెంచగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.74, డీజిల్‌ లీటర్‌ రూ.81.12కు చేరింది.

ముం బైలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.97.12, డీజిల్‌ రూ.88.19, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.70, డీజిల్‌ రూ.86.09, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.90.92, డీజిల్‌ రూ.83.98కు చేరాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెట్రోల్‌ ధర ఇప్పటికే రూ.100 దాటింది.