కరోనా కట్టడికి రూ. 50 వేల కోట్లు:ఆర్బీఐ

58
rbi

వ‌చ్చే ఏడాది మార్చి 22 వ‌ర‌కు క‌రోనా సంబంధ‌ ఆరోగ్య స‌దుపాయాల మెరుగు, సేవ‌ల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్ల లిక్విడిటీని ప్రకటించింది ఆర్బీఐ. ఈ మేరకు వివరాలను వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. మీడియాతో మాట్లాడిన ఆయన

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉందని… సెకండ్ వేవ్ రూపంలో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు.

కరోనా మహమ్మారి బారి నుంచి భారత్ త్వ‌ర‌లోనే బయట పడుతుందన్న నమ్మకం ఉందని…రెపో రేటును మార్చి 2022 వరకూ ఓపెన్ గానే ఉంచుతామని అన్నారు. గతంలో రెండు సంవత్సరాలపాటు మారటోరియం సదుపాయం పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం ప్రకటిస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు.