చుక్కలు చూపిస్తోన్న ధరలు..

217
Petrol Price Hike
- Advertisement -

పెట్రోల్, డీజిల్ ధరలు తెలుస్తుంటే.. వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. రోజురోజుకి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మారుతూనేఉన్నాయి.

Petrol Price Hikeశుక్రవారం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ఆల్‌టైమ్ హై రూ.87.39ని తాకింది. ఒక్కరోజే లీటర్‌కు 48 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర రూ.79.99కి చేరింది. డీజిల్ ధర శుక్రవారం ఢిల్లీలో లీటర్‌కు 52 పైసలు, ముంబైలో 55 పైసలు పెరగడం గమనార్హం. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.91, డీజిల్ ధర రూ.78.48గా ఉంది.

రూపాయి విలువ పడిపోతుండటం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలను పెంచుతుండగా.. ఆ భారం మనపై కూడా పడుతోంది. కాగా.. ఈ మధ్యకాలంలో బుధవారం ఒక్కరోజే పెట్రో ధరలను మార్చకుండా ఉంచారు. గురు,శుక్రవారాల్లో మళ్లీ యాథావిధిగా ధరలు పెంచారు. ఇంత జరుగుతున్నా..ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా..ప్రభుత్వం రోజువారీ లేదా వారం వారం పెట్రోధరలపై స్పందించాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పడం విశేషం.

- Advertisement -