- Advertisement -
దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. వరుసగా 21వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఓ వైపు ప్రజల నుండి తీవ్ర నిరసన వస్తున్న ఇవేమీ పట్టించుకోని చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచుతూనే ఉన్నాయి.
లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.83.44కు, డీజిల్ ధర 21 పైసలు పెరుగుదలతో రూ.78.57కు చేరాయి. దీంతో 21 రోజుల్లో డీజిల్‌పై మొత్తం రూ.10.27, పెట్రోల్‌పై రూ.9.18 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.38, లీటర్ డీజిల్ ధర రూ.80.40కి చేరింది.
లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్ 7 నుంచి దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్ 1న లీటర్ పెట్రోల్ ధర రూ.71.26గా ఉండగా, ప్రస్తుతం అది రూ.80.33కి చేరింది.
- Advertisement -