పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

364
petrol price
- Advertisement -

పెట్రోల్,డీజీల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 45 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.81.89, డీజిల్‌ రూ.71.86కు చేరాయి.

హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 48 పైసలు పెరగగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.85.17, డీజిల్‌ రూ.78.41కు చేరింది.ముంబైలో పెట్రోల్‌ ధర రూ.88.58, డీజిల్ రూ.78.38, చెన్నైలో పెట్రోల్‌ రూ.84.91, డీజిల్ 77.30, కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.83.44, డీజిల్‌ రూ.75.43గా ఉంది.

- Advertisement -