పెట్రోల్‌పై 37, డీజిల్‌పై 38 పైసలు పెంపు..

168
petrol
- Advertisement -

పెట్రోల్, డీజీల్ ధరల పెంపు ఆగడం లేదు. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ కూడా పెట్రోల్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 37 పైసలు పెరిగి రూ.111.55కి చేరగా, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.104.70కు చేరాయి.

ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.24కి చేరగా, డీజిల్‌ ధర రూ.95.97కు పెరిగింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.113.12, డీజిల్‌ రూ.104కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.107.78, డీజిల్‌ రూ.99.08, చెన్నైలో పెట్రోల్‌ రూ.104.22, డీజిల్‌ రూ.100.25కి చేరాయి.

గత నెల 28 నుంచి ఈ నెల 23 వరకు 20 సార్లు పెట్రోల్‌ ధరలు పెరిగాయి. డీజిల్‌ విషయానికి వస్తే.. గత నెల 24 నుంచి ఈ నెల 23 వరకు 23 సార్లు ధరలు పెరిగాయి.

- Advertisement -