గాంధీ భవన్‌లో గాడ్సే…రేవంత్‌కు కేటీఆర్ పంచ్‌

54

పీసీసీ చీఫ్ రేవంత్,బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. మీడియాతో మాట్లాడిన ఆయన రెండు జాతీయ పార్టీలకు కోతీయ అధ్యక్షులు వచ్చారని చెప్పారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వీరిద్దరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

గాంధీ భవన్‌లోకి గాడ్సే దూరాడు. ఇది నా మాట కాదు.. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్వయంగా అన్నారని గుర్తు చేశారు కేటీఆర్. ఆరెస్సెస్‌ మూలాలున్న వాళ్లను పీసీసీ అధ్యక్షుడిని చేశారని అమరీందర్‌ చెప్పారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? జీవన్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు వంటివారు ఏమయ్యారు? అని ప్రశ్నించారు.

హుజూరాబాద్‌ ఫలితం ఎలా ఉన్నా ఈటల రాజేందర్‌ మరో ఏడాది, ఏడాదిన్నరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అన్నారు. వీరిద్దరు గోల్కొండ రిసార్ట్‌లో రహస్యంగా కలుసుకొని చర్చలు జరిపారు. ఇది నిజం కాదా? ఒకవేళ నిజం కాదని వారు అంటే ఆధారంగా నా దగ్గర ఫొటోలు కూడా ఉన్నాయి. వాటిని తగిన సమయంలో బయటపెడతానని చెప్పారు.