కొనసాగుతున్న పెట్రోల్‌ ధరల పెంపు..!

474
- Advertisement -

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత కొంత కాలంగా భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. సరికొత్త రికార్డులను ఛేదిస్తూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్కై రాకెట్‌ల దూసుకుపోతున్నాయి. పెట్రోలు ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. నేడు కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ఆదివారం నాడు లీటరు పెట్రోలుపై 9 పైసలు, డీజెల్ పై 15 పైసల మేరకు ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.

Fuel prices

దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 88.51కి, డీజిల్ ధర రూ. 81.33కు పెరిగాయి. ఇదే సమయంలో విజయవాడలో పెట్రోలు ధర లీటరుకు రూ. 87.86కు, డీజిల్ ధర రూ. 80.35కు చేరింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 83.49గా, డీజిల్ ధర రూ. 74.79గా ఉంది. ఇక పెట్రో ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండే ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 90.84కు, డీజిల్ ధర రూ. 79.40కి చేరుకుంది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై పడుతోంది. ఈ ప్రభావంతో కూడా దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి.

- Advertisement -