తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

125

మూడు నెలల తర్వాత దేశంలో పెట్రోల్ ధర మొదటి సారి తగ్గింది. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 14పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గించారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69, డీజిల్‌ ధర రూ.97.15కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడంతో దేశీయ విక్రయ సంస్థలు తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీలో అక్టోబర్‌ కాంట్రాక్టుకు బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లుగా పలుకుతోంది.

జులై 18 నుంచి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొత్తం 41 సార్లు పెట్రో ధరల్ని పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఒక నెల పాటు రోజు విడిచి రోజు ధరలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.11.44, డీజిల్‌ ధర రూ.8.74 మేర పెరగడం గమనార్హం.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69 ఉండగా డీజిల్‌ ధర రూ. 97.15 ఉంది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.64, డీజిల్‌ ధర రూ. 89.07 ఉంది. ఇక కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.93,డీజిల్‌ 92.13, ముంబయిలో పెట్రోల్‌ 107.66.. డీజిల్‌ 96.64గా ఉంది. చెన్నైపెట్రోల్‌ 99.32, డీజిల్‌ 93.66 గా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్‌ 105.13,డీజిల్‌ 94.49గా ఉంది. అలాగే లఖ్‌నవూలో పెట్రోల్‌ 98.70,డీజిల్‌ ధర 89.45గా ఉంది.