వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. తాజా సవరణ ప్రకారం లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, అలాగే లీటర్ డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పెరిగిన ఈ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమలులోకి వచ్చాయని బంక్ నిర్వాహకులు తెలిపారు. తాజా పెంపుతో భాగ్యనగరంలో ఇంధన ధరలు సెంచరీ దాటి దూసుకుపోతున్నాయి. పెరిగిన రేట్ల తర్వాత నగరంలో లీటర్ ధరలు పెట్రోల్ (లీటరు): రూ. 112.84,డీజిల్ (లీటరు): రూ. 100.94గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నెపంతో దేశీయంగా ధరలను పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఒక్క నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. వరుసగా ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వరుస పెంపుదలపై నగర వాహనదారులు, రవాణా రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పెట్రోల్ ధరలు ఇలాగే పెరుగుకుంటూ పోతే రోజువారీ బడ్జెట్ తలకిందులవుతుందని సామాన్యులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పన్నులు తగ్గించి ఉపశమనం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read:చిన్నతనంలో జంక్ ఫుడ్..షాకింగ్!
