పెసరట్టు – ఉప్మా…చరిత్ర

73
- Advertisement -

రోజు ఒకే రకమైన టిఫిన్ తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అదే ఇడ్లీ అదే ఉప్మా లేదా ఒకే రకమైన దోశలు తింటుంటే రోటిన్‌గా ఉంటుంది. అయితే దోశలంటే అమితంగా ఇష్టపడే వారికి ఎన్నిరకాల దోశలు ఉంటాయో తెలియదు. తీన్మార్‌ దోశ, పావు బజ్జీ దోశ , పిజ్జాదోశ, కాజుదోశ, దిల్‌కుష్‌దోశ, పావ్‌బాజీ దోశ, ప్రకృతి దో శ, మైసూర్ దోశ ఇలా రకరకాల దోశలున్నాయి. అయితే వీటిలో పెసరట్టు ఉప్మాది ప్రత్యేక స్ధానం. ఈ కాంబినేషన్‌ లేనిదే చాలా మందికి రుచించదు. అంతటి ప్రీతికరమైన, పసందైన టిఫిన్‌ అది.

అయితే పెసరట్టు ఉప్మా దోశ పసందైన టిఫిన్ మాత్రమే కాదు దాని వెనుక చాలా పురాతనమైన పురాణం ఉంది. ఉప్పు పిండి,చప్పిడి పిండి,పులుసు పిండి (పిండి పులిహార). ఇందులో ఘోర తపస్సు ఆచరించిన ఉప్పుపిండి 6 గురు పుత్రికలను పొందిందట.

1.వరినూక ఉప్మా
2.జొన్ననూక ఉప్మా
3.గోధుమనూక ఉప్మా
4.మొక్క జొన్న ఉప్మా
5.కొర్ర నూక ఉప్మా
6.బొంబాయిరవ్వ ఉప్మా

Also Read:నీరా కేఫ్‌ను తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్

మొదటి 5 గురు కన్యలు వివాహం చేసుకోకుండా, ఉపవాసములు, ఏకాదశినాడు ‌వ్రతములయందు భక్తులకు ఫలహారాలు అందించేవారట. వీరి సేవకు మెచ్చిన పరమేశ్వరుడు..మీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు.అంతట ఆ అయిదుగురు మా ఆఖరి సోదరికి వివాహం జరిగి,దాని దాంపత్యం కలియుగాంతం వరకు అన్యోన్యంగా ఉండేలా వరమివ్వమని కోరగా పరమేశ్వరుడు సంతోషించి,నవగ్రహములలో విశిష్టత పొందిన బుధుడి అంశతో జన్మించిన పెసరట్టు తో వివాహం జరిపించినట్టు పురాణం వచనం.

అందుకే అన్యోన్యంగా ఉండే దంపతులను పెసరట్టు ఉప్మా లా కలిసిఉన్నారనడం ఓ నానుడి.

Also Read:సీఎం ప్రధాన సలహాదారుడిగా సోమేష్ నియామకం

నోట్‌: ఈ సమాచారం సోషల్ మీడియాలో సర్కూలేట్ అవుతున్న ఓ వార్త ఆధారంగా సేకరించబడింది.

- Advertisement -