ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ ‘టైమ్స్’ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు వరుసలో నిలిచారు. ఈ ఏటి మేటి వ్యక్తి పోటీలో ప్రధాని నరేంద్రమోడీ..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు ఒరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లను సైతం వెనక్కు నెట్టి ఈ ఏడాది ప్రభావంతమైన వ్యక్తిగా మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ 4తో రీడర్స్ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇందులో మోదీ 18 శాతం అనుకూల ఓట్లతో మొదటి స్థానంలో నిలిచి..‘టైమ్స్’ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2016’గా ఆయన మరో ఘనత సాధించారు.
మోడీతో పోటీ పడిన సమీప ప్రత్యర్థులు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జూలియన్ అసాంజే.. వీళ్లందరికీ కూడా కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌కు 4 శాతం, మార్క్ జుకర్‌బర్గ్‌కు 2 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయులతో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల వారు కూడా మోదీకి అనుకూలంగా బాగా ఓటుచేసినట్లు తెలుస్తోందని ప్రస్తుత సర్వే వివరాలను విశ్లేషించిన యాప్‌స్టర్ సంస్థ తెలిపింది.
ఉగ్రవాదంపై పోరు..ప్రభావంతమైన స్పీచ్.. బ్లాక్ మని కట్టడికి పెద్ద నోట్ల రద్దు వంటి విషయాలతో మోడీ పాఠకులను బాగా ఆకట్టుకున్నాడు. మంచీచెడు ఏదోరకంగా ఏడాది కాలంలో వార్తల్ని, ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి ఈ గౌరవాన్ని అందిస్తారు. గత ఏడాది జర్మన్ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ టైమ్స్ ఏటి మేటి వ్యక్తిగా ఎంపికయ్యారు. ప్రపంచ నేతలు, అధ్యక్షులు, ఉద్యమకారులు, వ్యోమగాములు, పాప్ దిగ్గజాల నుంచి మేటి వ్యక్తిని టైమ్స్ సంపాదకులు నిర్ణయిస్తారు. పాఠకుల నుంచి ఓటింగ్‌ను కూడా కోరతారు.
టైమ్స్ మ్యాగజైన్ లో ప్రభావంతమైన వ్యక్తిగా మోడీ పోటీలో నిలవడం ఇది నాలుగోసారి. అయితే, ప్రధాన అవార్డు ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ మాత్రం ఆయనకు అప్పట్లో దక్కలేదు. గత ఏడాది ఈ అవార్డు జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్‌కు దక్కింది. ఈ అవార్డును ప్రతి ఏడాదీ ప్రపంచం మొత్తాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు ఇస్తారు. టైమ్స్ మ్యాగజైన్‌తో ప్రపంచంలో వివిధ నాయకులు, కళాకారులు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులందరిలో అగ్రగామి ఎవరంటే భారత ప్రధాని నరేంద్రమోదీయేనని తేలింది. టైమ్స్ మ్యాగజైన్ ఈ నిర్ణయాన్ని ఈనెల అధికారికంగా 7వ తేదీన వెల్లడించనుంది.