ప్రపంచం ఇంత ప డిజిటల్ టెక్నాలజీ తో దూసుకుపోతున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. తాజాగా మూఢనమ్మకాలను నమ్మి మరో వ్యక్తి బలి అయ్యాడు. మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట పరిధిలోని అద్రాస్ పల్లిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. చేతబడి చేశాడనే కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి కాల్చి చంపారు.
గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో భాదపడుతుంది. ఆమె ఆరోగ్య పరిస్ధితి క్షిణించడంతో తాజాగా ఆమె మృతి చెందింది. దీంతో ఆమెకు కుటుంబ సభ్యులు మహిళ దహనసంస్కారాలు నిర్వహించారు. లక్ష్మి దహన సంస్కారాలు జరిగిన ప్రాంతానికి ఆంజనేయులు అనే వ్యక్తి రాత్రి వెళ్లాడు. కాగా ఇప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులకు ఇతడిపై అనుమానం ఉంది.
ఆంజనేయులు అనే వ్యక్తి చేతబడి చేయడంతోనే లక్ష్మీ అనే మహిళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అనుమానించారు. ఉదయం అంజనేయులును పట్టుకుని కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం మహిళను దహనం చేసిన చోటే అతన్ని కూడా సజీవ దహనం చేశారు. లక్ష్మీ కుటుంబ సభ్యులు చేసిన పనిపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.