ధరణి రద్దయితే..లంచగొండుల రాజ్యమే!

58
- Advertisement -

తెలంగాణ ఈ మద్య ధరణి పోర్టల్ కు సంబంధించిన అంశం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించడంతో చర్చ మొదలైంది. భూ రిజిస్ట్రేషన్ కు సంబంధించి రైతులకు సత్వర సేవలు అందించేందుకు కే‌సి‌ఆర్ సర్కార్ ధరణి పోర్టల్ ను ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టారు. భూ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లకుండా ధరణి ద్వారా వేగంగా, తేలికగా, పారదర్శికంగా, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా సేవలు అందిస్తోంది కే‌సి‌ఆర్ సర్కార్.

ధరణి వచ్చిన తరువాత భూ రిజిస్ట్రేషన్ విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దాంతో అటు రైతుల్లోనూ ఇటు సామాన్యుల్లోనూ ధరణిపై సానుకూలత మెండుగా ఉంది. అయితే ధరణిపై రాజకీయం చేసి లభ్ది పొందేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ధరణిలో అవినీతి జరుగుతోందని, లేని అభియోగాన్ని కే‌సి‌ఆర్ సర్కార్ పై మొపే ప్రయత్నం చేస్తున్నాయి ఆ రెండు పార్టీలు. అందుకే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని చెబుతున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నిర్ణయాలాపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఎందుకంటే ధరణి ద్వారా లబ్ది పొందిన లబ్దిదారుడు ఆ రెండు పార్టీల నిర్ణయాన్ని ఏమాత్రం సమర్థించే పరిస్థితి లేదు.

Also Read:వీటితో కొలెస్ట్రాల్‌ కు చెక్ పెట్టండి…

ధరణి రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తాజాగా ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ధరణి ని తీసేస్తామని ఆయా పార్టీలు చెబుతున్నాయని, అదే గనుక జరిగితే మళ్ళీ పైరవీకారుల, లంచగోండుల రాజ్యం వస్తుందని సి‌ఎం కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. ఒక విధంగా కే‌సి‌ఆర్ చెప్పిన వ్యాఖ్యలు ముమ్మాటికి సత్యమే అని చెప్పాలి. గతంలో భూ రిజిస్ట్రేషన్ కోసం రైతుల నుంచి అధికారులు లంచాలు దండుకొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి అవినీతి కార్యకలాపాలకు చెక్ పెడుతూ ధరణిని ప్రవేశ పెట్టిన తరువాత పారదర్శికంగా రిజిస్ట్రేషన్ పనులు జరుగుతున్నాయనే చెప్పాలి.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -