ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా.. మోడీజీ !

43
- Advertisement -

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇష్టానుసారంగా అన్నిటిపై ధరల మోత మోగించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్, ముడి చమురు వంట నూనె.. నిత్యవసర వస్తువులు.. ఇలా ప్రతిదానిపై మోడి వేసిన ధరల భారం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అధికారం చేతిలో ఉందని, అడిగేవారు లేరని, తాము అమలు చేసిందే చట్టం అన్న రీతిలో కేంద్ర పెద్దలు వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజల్లో ఆగ్రహ జ్వ్జలలు కట్టలు తెంచుకునేలా చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రజలు గర్వంగా చెప్పుకునే ఒక్క మంచి ఏదైనా ఉందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.. కానీ బీజేపీ దుష్టత్వ పాలన గురించి చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.

ధరల పెరుగుదల, మణిపూర్ అల్లర్లు, మతతత్వ రాజకీయం.. అబ్బో ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు వంట గ్యాస్ విషయానికొస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 1200 రూపాయలు దాటింది. ఇదేంటి అని ప్రశ్నిస్తే కరోనా కారణంగా ఆర్థిక వృద్ది రేపు పడిపోయిందని ఏవోవో కారణాలు చెబుతూ వచ్చారు కేంద్ర పెద్దలు. కానీ ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రెండు సార్లు గ్యాస్ ధరలను తగ్గించింది మోడి సర్కార్. గత నెలలో రూ.200 వరకు సబ్సిడీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి గ్యాస్ ధరలను తగ్గించింది.

మరి ఇన్నాళ్ళు ధరలతో మోత మోగించి సామాన్యుడి జీవనాన్ని ప్రశ్నార్థకం చేసిన మోడి సర్కార్ కు సడన్ గా ఇప్పుడేందుకు ప్రజలపై ప్రేమ పుట్టుకొచ్చింది అంటే ఎన్నికల స్ట్రాటజీ కాక మరెంటి అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయవాదులు. గత నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన ప్రధాని మోడి ఇప్పుడు మాత్రం తెలంగాణపై కపట ప్రమ కురిపిస్తూ వరస పర్యటనలు చేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నికలు వస్తేనే ప్రధాని మోడికి ధరల తగ్గించాలని, రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని తన బాద్యత గుర్తుకు వస్తుందా? లేదంటే మోడికి ఆ ఆలోచన ఉండదా ? అంటే ప్రధాని మోడి వ్యవహార శైలి చూస్తే నిజమేనేమో అనే అభిప్రాయం రాక మానదు.

- Advertisement -