ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం చేపట్టాలి : డీహెచ్ శ్రీనివాస్‌ రావు

112
dh srinivas rao
- Advertisement -

కొవిడ్‌ నుంచి బయటపడ్డామని కాని వర్షాల వల్ల సీజనల్‌ వ్యాధులతో పొరాడాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాస్‌ రావు అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున్న డీఎంహెచ్‌వోలతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశం నిర్వహించి సన్నద్ధతపై ఆదేశాలు ఇచ్చారని ఆయన తెలిపారు.

బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్‌ వ్యాధులు వస్తాయి. వర్షాలు పడే సమయంలో అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకి రావాలి. కరోనాకు ముందు డెంగీ కేసులు వచ్చాయి కాని ఎక్కువగా మరణాలు నమోదు కాలేదన్నారు. ఈ ఏడాది నుంచి జనవరి నుంచి ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు వచ్చాయి. కాగా జులై లో తొలి పది రోజుల్లోనే 222 కేసులు వచ్చాయని తెలిపారు. దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నం. దీన్ని పెంచాలని డీఎంహెచ్‌వోలకు ఆదేశాలిచ్చాం మున్సిపల్‌, పంచాయితీ రాజ్‌, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపడుతున్నాం. రెండు మూడు జిల్లాలో నుంచి మలేరియా కేసులు వస్తున్నాయి. ఏక్కువగా భద్రాద్రి, ములుగులోనే కేసులు వస్తున్నాయని తెలిపారు.

ఈ ఏడాది టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మేలో 2,700 జూన్‌లో 2,752 కేసులు వచ్చాయని తెలిపినాయన….ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవడం ద్వారా ప్రజలు సీజనల్‌ వ్యాధుల నుంచి సురక్షితంగా బయటపడొచ్చన్నారు. ప్రజలు ఫ్రై డే – డ్రై డే కార్యక్రమం చేపట్టాలి. వేడి వేడి ఆహారం తీసుకొవాలన్నారు. నీరు రంగు మారితే తప్పకుండా కాచి చల్లార్చి తాగాలన్నారు. జలుబు, విరేచనాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.

గత ఆరు వారాలుగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కొవిడ్‌ కూడా ఓ సీజనల్‌ వ్యాధిగా మరిందన్నారు. ఒక వేళ కొవిడ్‌ వస్తే కేవలం 5 రోజులే క్వారంటైన్‌లో ఉండాలి అని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో టెస్ట్ కిట్‌లు ఆందుబాటులో ఉన్నాయన్నారు. బాలింతలు, చంటి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఉండి మాస్క్ ధరిస్తూ ఐసోలేషన్‌ పాటించాలని సూచించారు.

- Advertisement -