సూర్యగ్రహణం….. చూద్దాం రారండి

474
scientists
- Advertisement -

ఇవాళ ఉదయం 7.59 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం కొనసాగుతోంది. పది సంవత్సరాల తరవాత వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంను చూసేందుకు ఇందిరా పార్కు దగ్గర ఎన్టీఆర్ స్టేడియంకు శాస్త్రవేత్తలతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు.

ఇదో అరుదైన సూర్యగ్రహణమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ సూర్య గ్రహణాన్ని నేరుగా కానీ.. బైనాక్యులర్‌తో కానీ చూడొద్దని.. సోలార్‌ ఫిల్టర్లతోనే చూడాలని చెబుతున్నారు. ఏడాదిలో ఐదు సూర్యగ్రహణాలు రావడం అరుదని తెలిపారు. సూర్యగ్రహణం మధ్యాహ్నం 12:30 గంటలకు ముగియనుంది.

- Advertisement -