గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తాం: తలసాని

485
talasani srinivas
- Advertisement -

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తాం అని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నల్లగొండ జిల్లా దిండి పర్యటనలో భాగంగా మార్గం మధ్యలో నాగర్‌ కర్నూల్ జిల్లా వెల్దండలో మీడియాతో మాట్లాడిన తలసాని …టీఆర్ఎస్ ప్రభుత్వం,కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు.

60 సంవత్సరాలలో జరగని అభివృద్ధి గడిచిన 5 సంవత్సరాలలో జరిగిందన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా గొర్రెల పెంపకం దారులకు గొర్రెలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాలు, వలలు, పరికరాలు అందజేశామని చెప్పారు.

రాష్ట్రంలో 600 పశువైద్యశాలలు 12 కోట్లతో ఆధునీకరించారమని చెప్పారు. 1962 టోల్ ఫ్రీ నెంబర్‌తో సంచార పశు వైద్యశాలలు జీవాలవద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి అనేదే ప్రభుత్వ ఆశయం అని చెప్పారు. హుజుర్ నగర్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని తెలిపారు.

- Advertisement -