- Advertisement -
ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని…మున్సిపోల్స్‌లో గెలుపు గులాబీదే అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,అసెంబ్లీ ఇంచార్జీలతో మాట్లాడిన సీఎం…మున్సిపల్ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు.
అభివృద్ధి మన మంత్రమని …అన్ని మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంగా ముందుకుసాగాలన్నారు. ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉందని…టికెట్లు రాని వారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని స్పష్టం చేశారు. టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
- Advertisement -