రివ్యూ: దర్బార్

877
darbar movie review

సూపర్ స్టార్ రజనీకాంత్- మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబై పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో రజనీ కనిపించనుండగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాతో రజనీ హిట్ కొట్టాడా…?లేదా చూద్దాం

కథ :

తప్పు చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేయడమే లక్ష్యంగా ముందుకుసాగే పోలీస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం (రజినికాంత్). ఈ క్రమంలో ముంబై సిటీలోని డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాడు. ఈ నేపథ్యంలో ఆదిత్య అరుణాచలంకు ఎదురైన సవాళ్లు ఏంటి..?విలన్ హరి చోప్రాపై అరుణాచలం ఎలా పగతీర్చుకున్నాడు..?రజనీ మ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా ఎలా మారాడు అన్నది తెరపై చూడాల్సిందే.

Image result for దర్బార్

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ రజనీకాంత్,నివేదా థామస్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. వయసు మీద పడుతున్న రజనీ స్టైల్,మ్యానరిజమ్‌లో ఏ మాత్రం వేడి తగ్గలేదు. మ్యాడ్ కాప్‌గా రజనీ నటన సూపర్బ్.ఈ మధ్య కాలంలో ఇదే రజనీ బెస్ట్ లుక్‌. ఇక రజనీ సరసన నటించిన నయనతారకు అంత ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కలేదు కానీ మరో హీరోయిన్ నివేదా పాత్ర సినిమాకు టర్నింగ్ పాయింట్. రజనీతో ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించింది నివేదా.విలన్‌గా సునీల్ శెట్టి పర్‌ఫెక్ట్‌గా సెట్ అవ్వగా మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథ,సెకండాఫ్. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని బాగా ఉన్నా కథ మాత్రం డిఫరెంట్ గా అనిపించదు. స్క్రీన్ ప్లే కాస్త రేసీగా ఉండటం వల్ల సినిమా ఓకే అనిపించేలా ఉంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. సినిమాటోగ్రఫీ బాగుంది. కథలో దమ్ము లేకపోయినా కథనంలో తన మార్క్ చూపించాడు మురుగదాస్. అనిరుద్ అందించిన సంగీతం, పాటలు బాగున్నాయి.ఎడిటింగ్ పర్వాలేదు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for దర్బార్

తీర్పు:

కబాలి తర్వాత ఆ రేంజ్‌లో విశ్వరూపం చూపించాడు రజనీకాంత్. 70 ఏళ్ల వయసులో రజిని నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఓవరాల్‌గా రజనీ ఫ్యాన్స్‌కు పర్‌ఫెక్ట్ పొంగల్ ట్రీట్ దర్బార్.

విడుదల తేదీ:09/01/2020
రేటింగ్:2.5/5
నటీనటులు: రజినీకాంత్, నయనతార
సంగీతం: అనిరుధ్
నిర్మాత: ఎన్వీ ప్రసాద్ , లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్