Revanth Reddy: గుంపు మేస్త్రి పాలన.. ఇదేనా?

34
- Advertisement -

తెలంగాణ సి‌ఎం రేవంత్ రెడ్డిపై రోజు రోజుకు విమర్శలు పెగుతున్నాయి. ఆయన పాలనలో అనుభవ లోపం కనిపిస్తోందని ఆయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్నాయని సామాన్యులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో తగు నిర్ణయాలు తీసుకోవడం మాని రాష్ట్రంలో అనవసర మార్పులకు సి‌ఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే.. టీఎస్ స్థానంలో టిజీ ఉండేలా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రాష్ట్ర గుర్తులో కాకతీయ కళాతోరణాన్ని తొలగించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమౌతుందడమే విమర్శలకు ప్రధాన కారణం. కాకతీయ కళాతోరణం రాచరికపోకడలను అనుసరిస్తుందని, అందుకే తెలంగాణలోగోలో దానిని తొలగించాలని డిసైడ్ అయినట్లు కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. అయితే కాకతీయ కళాతోరణం అనేది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలంగాణ చరిత్రను చాటిచెప్పే కళాతోరణాన్ని లోగోలోంచి తొలగిస్తే తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చినట్లే అనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రజల నుంచి ప్రతికూలత వ్యక్తమవుతోంది.

ఇలాంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి అనుభవ లోపాన్ని సూచిస్తున్నాయని బి‌ఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. సి‌ఎం పదవి పదవి అనేది గుంపు మేస్త్రి తరహా పదవి అని, అందరినీ మేనేజ్ చేయడమే గుంపు మేస్త్రీ బాధ్యత అని రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలను షేరు చేస్తూ గుంపు మేస్త్రి పాలన అంటే ఇదేనా అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి సి‌ఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఆయా నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:‘దేవర’ కోసం 2 క్లైమాక్స్ లు?

- Advertisement -