నో క్లారిటీ.. వెయిటింగ్ లో బాబు, పవన్?

15
- Advertisement -

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అంశం తరచూ హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీని కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న టీడీపీ జనసేన పార్టీలకు ఇంకా వెయిటింగ్ తప్పడం లేదు. ఇటీవల పొత్తు కోసం బీజేపీ పెద్దలను చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. కానీ పొత్తు చేయడంపై బీజేపీ ఇంకా తుది నిర్ణయం వెల్లడించలేదు. ఇదే ఇప్పుడు అసలు సమస్య.. ఎందుకంటే బీజేపీ డెసిషన్ తరువాత సీట్ల ప్రకటన చేయాలని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ డెసిషన్ చెప్పకపోవడం వల్ల సీట్ల ప్రకటనలో జాప్యం జరిగే అవకాశం ఉంది. దాంతో పొత్తుపై బీజేపీ ఎలాంటి ప్రకటన చేస్తుందోనని అటు టీడీపీ లోనూ ఇటు జనసేనలోనూ అంతర్మథనం మొదలైంది..

ఇకపోతే ఏపీలో పొత్తు అంశంపై ఇటీవల అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” ఏపీలో పొత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని ” అమిత్ షా చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీతో కలవడానికి బీజేపీ ఇంకా సందేహిస్తూనే ఉందా ? అనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ టీడీపీతో కలిసే ఉద్దేశం లేకపోతే బీజేపీ ఎందుకు ఫైనల్ డెసిషన్ చెప్పడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో బీజేపీ వైఖరి కారణంగా చంద్రభాబు, పవన్ ఎటు తేల్చుకోలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి పొత్తు విషయంలో బీజేపీ ఆడుతున్న దాగుడుమూతలు టీడీపీ జనసేనకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సీట్ల కేటాయింపుపై ఓ నిర్ణయానికి వచ్చిన టీడీపీ జనసేన పార్టీలు.. పొత్తుపై బీజేపీ డెసిషన్ తరువాత సీట్ల ప్రకటన చేయనున్నాయి. మరి బీజేపీ ఫైనల్ డెసిషన్ ఎప్పుడు వెల్లడిస్తుందో చూడాలి.

Also Read:‘దేవర’ కోసం 2 క్లైమాక్స్ లు?

- Advertisement -