కొత్త డేట్‌ ను ఫిక్స్‌ చేసుకున్న డీజే..

121

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ కోసం ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. పూజ హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా టీజర్ ను మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ  టీజర్‌ సోషల్‌ మీడియాలో ఎంతటి సంచలనం సృష్టిస్తోందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ట్రైలర్‌ డిస్‌లైకులలో కూడా సంచలనం సృష్టించింది.
A New Release Date for Duvvada Jagannadham
అల్లు అర్జున్ ..పవర్ స్టార్ గురించి మాట్లాడను అని చెప్పడం అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కారకుడయ్యాడు అల్లు అర్జున్. అప్పటి నుంచి బన్నీ అంటేనే చాలు తెగ ఫైర్ అయిపోతున్నారు పవన్ అభిమానులు. ఆ ఆగ్రహాన్నిడీజే-దువ్వాడ జగన్నాథం టీజర్‌పైనే చూపించేశారు. ఎన్ని లైకులు కొట్టారో.. దాదాపు అన్నే డిస్‌లైకులను కొట్టేశారు పవన్ అభిమానులు.
A New Release Date for Duvvada Jagannadham
ఇక వరుస హిట్స్ తో టాలీవుడ్ లో సూపర్ ట్రాక్ లో ఉన్నాడు అల్లు అర్జున్. ఇక ఈ టీజర్‌ డిస్‌లైక్స్‌ ప్రభావం డీజే మీద ఏ మాత్రం పడలేదనే చెప్పాలి. ఎందుకంటే డీజేకి ఎంత డిజ్‌లైక్‌లు వచ్చయో..అంతకంటే ఎక్కువగానే పబ్లిసిటీ పెరిగిపోంది.

అందుకే డీజే కోసం ఇప్పుడు ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా రిలీజ్ డేట్ మారినట్లు తెలుస్తోంది. డీజే సినిమాను జులై 7 విడుదల చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాను జులై 7వ తేదీన విడుదల చేసేందుకే సినిమా బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫస్ట్ లో ఈ సినిమాను మే 19న విడుదల చేయాలని భావించినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యూల్‌ను మార్చినట్టు తెలుస్తోంది.