రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ బి గోపి ఐఏఎస్ విసిరినా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు ఫిర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్.
ఈ సందర్బంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఇది ఒక్కరిద్దరు చేస్తే కాదు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు తమ పరిసరాలలో మూడు మొక్కలు నాటాలని , గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన లక్ష్యం తో హరితహారం లో భాగంగా మొక్కలు నాటుతూ పర్యావరణం కోసం భావితరాలకు మంచి వాతావరణం అందించాలని కృషి చేస్తున్నారని తెలిపారు .
దానికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు . ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని నా వంతుగా మరో ముగ్గురికి మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్ గారు , శ్రీ మధు గారు సెంట్రల్ ఇంటలిజెన్స్ విజయవాడ గారు వేణుగోపాల్ గారు కమిషనర్ బండ్లగూడ జాగీర్ గార్లకి ఛాలెంజ్ చేశారు .