దేశంలో 86 లక్షలు దాటిన కరోనా కేసులు…

80
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలు దాటాయి. గ‌త 24 గంటల్లో కొత్తగా 44,281 క‌రోనా కేసులు న‌మోదుకాగా 512 మంది మృతిచెందారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 86,36,012కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 4,94,657 యాక్టివ్ కేసులుండగా 80,13,784 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,27,571 మంది మృతిచెందారు.

గత 24 గంటల్లో 11,53,294 కరోనా టెస్టులు నిర్వహించగా నవంబ‌ర్ 10 వ‌ర‌కు 12,07,69,1515 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఐసీఎమ్మార్ తెలిపింది.