తనపై జరుగుతుందంతా తప్పుడు ప్రచారమే: పెద్దిరెడ్డి

0
- Advertisement -

పుంగనూరు లో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారు అన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చంద్రారెడ్డి. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాభై కోట్లు పరువు నష్టం దావా వేశారు , 2001లో దాదాపు 75 ఎకరాలను స్దానికుల నుండి కోనుగొలు చేశాం‌నన్నారు. సొంత డబ్బులతో కోన్న దానిపై అసత్య ప్రచారం చేశారు‌‌… చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా , వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు అన్నారు.

2001లోనే అక్కడ ఇల్లు కట్టాము….అప్పుడే మామిడి చెట్లు పెట్టాము… ఇరవై ఏళ్ల తరువాత ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారంటూ ప్రచారం చేస్తున్మారు..గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే విచారణ జరిగింది ప్రైవేట్ భూమి నివేదిక ఇచ్చారు అన్నారు. భూమి కొనుగోలు సంబంధించిన రికార్డులను మీడియాకు చూపించారు పెద్దిరెడ్డి.

ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే నిజం అయిపోదు…తప్పుడు ప్రచారం పై పరువు నష్టం దావ మళ్ళీ వేస్తాము…చంద్రబాబు తాన అంటే పవన్ కల్యాణ్ తందాన అంటున్నారు..ఎన్నికల ముందు నలబై వేల కోట్లు ఇసుక లో దోచుకున్నాడని నాపై పవన్ ప్రచారం చేశారు‌…. ఇప్పుడు ఎందుకు నా మీద చర్యలు తీసుకోవడం లేదు…రెడ్ శ్యాండిల్ అక్రమ రవాణా చేశారని ప్రచారం చేశారు‌..‌అటవీశాఖ మంత్రి గా ఉండీ ….చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

Also Read:బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్ దుర్మార్గం: కేటీఆర్

వైసీపీ నేతలు దొంగలు అనే విష ప్రచారం చంద్రబాబు, పవన్ చేస్తున్నారు.. సూపర్ సిక్స్ అని చెప్పి‌‌…ఇప్పుడు చేయాలేను అని చంద్రబాబు చేతులెత్తాడు అన్నారు. ఎంతమంది పోయినా ఎంత మంది వచ్చిన పార్టీకి ఎమీ కాదు‌‌.. మళ్ళీ వైసీపీ గతం కంటే ఎక్కవ సీట్లలో విజయం సాధించడం ఖాయం‌.. సాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతం అన్నారు.

- Advertisement -