రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ప్రాథమిక రివ్యూల ప్రకారం పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు అప్పుడే రేటింగ్ ఇచ్చేశారు.
ఒక నెటిజన్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విశ్లేషిస్తూ.. ఇది ఒక రెగ్యులర్ టెంప్లేట్ కథనంతో సాగినప్పటికీ, కొన్ని భాగాలు ఆకట్టుకునేలా ఉన్నాయని, ఒక ప్రాధాన్యత కలిగిన కథతో వచ్చిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ‘టెర్రిఫిక్’ గా ఉందని, ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా మెచ్చుకోదగ్గదిగా ఉందని ఆయన రాశారు.
రామ్ చరణ్ అద్భుతంగా నటించారు మరియు సినిమాను ఒంటిచేత్తో నడిపించారు. పెద్ది కోసం చరణ్ పడిన శ్రమ సినిమా అంతటా కనిపిస్తాయి. ఏఆర్ఆర్ సంగీతం చాలా బాగుంది మరియు సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు సన ఒక నిజాయితీ గల కథను ప్రదర్శించడంలో విజయం సాధించారు, కానీ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది అని ఆ యూజర్ రాశారు.
మరో అభిమాని రామ్ చరణ్ నటనను కొనియాడుతూ.. ఈ సినిమాలో నన్ను బాగా ఆకట్టుకుంది కేవలం కథ మాత్రమే కాదు…అందులోని ఎమోషన్ కూడా. దర్శకుడు మిమ్మల్ని సినిమా నుండి ఎక్కడా పక్కకు మళ్లించడు. మొదట నుండి చివరి వరకు మిమ్మల్ని కథలో లీనం చేస్తాడు. రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. మీరు ఆయన అభిమాని కాకపోయినా, ఆయన నటన మిమ్మల్ని కుర్చీలో కుదురుగా కూర్చోబెట్టి సినిమా చూసేలా చేస్తుంది అని ట్వీట్ చేశారు.
Also Read:ఓటర్ల జాబితా ‘వడపోత’పై అప్రమత్తం!
ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ నటనపై స్పందించిన మరో యూజర్.. ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలు ఉండటంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎడిటింగ్‌లో కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాను సులభంగా ట్రిమ్ చేసి ఉండవచ్చని పలువురు నెటిజన్లు పాయింట్ అవుట్ చేశారు.

