భారీ రేటుకు ‘పెద్ది’ ఆడియో రైట్స్!

3
- Advertisement -

రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సినిమా లుక్‌ని రివీల్ చేయగా చరణ్ సరసన జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జరుగుతోంది.

ఉత్త‌రాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా మైత్రీమూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో, వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ భారీ పాన్‌ఇండియా ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. కన్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్‌కు సంబంధించి మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా ఆడియో రైట్స్‌ని టీ సిరీస్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకోగా ఇందుకోసం రూ.35 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గ్లింప్స్ ఏప్రిల్ 6న రామ నవమి కానుకగా రాబోతుంది.

Also Read:తిరిగి ‘స్టార్‌లైనర్’​లోనే అంతరిక్షానికి!

- Advertisement -