వేలేరుపాడులో పెద్దపులి కలకలం..

46
peddapuli

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కట్కూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి కలకలం రేపింది. తెలంగాణ కావడిగుండ్ల అడవి నుండి ఆంధ్రా ప్రాంతం కట్కూరు కోయిదా ఫారెస్ట్ రేంజ్ లోకి ప్రవేశించినట్టు ఏపీ అధికారులకు సమాచారం ఇచ్చారు తెలంగాణ ఫారెస్ట్ అధికారులు. దీంతో అప్రమత్తమైన ఏపీ అటవీ శాఖ అధికారులు 15 మంది సిబ్బందితో ఆధారాలు సేకరిస్తున్నారు.సీసీ కెమెరాలు ఏర్పాట్లపై ఉన్నతాధికారులను సంప్రదించిన రెస్ట్ డివిజనల్ రేంజ్ ఆఫీసర్..త్వరలోనే పెద్దపులి ఆచూకీ కనుగొంటామన్నారు.