ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఆర్.జి త్రీ జి ఎం సూర్య నారాయణ . పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్.జి త్రీ కార్యాలయ ఆవరణలో ఆర్.జి త్రీ జి ఎం సూర్య నారాయణ వారి స్టాప్ తో మొక్కలు నాటారు. అనంతరం ఆర్జీ 2 జియం సురేష్, జయం ఏపిఏ శ్రీని, రమేష్ బాబు లకు జి ఎం సూర్య నారాయణ గ్రీన్ చాలెంజ్ ను విసిరారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిఎం కేసిఆర్ మానస పుత్రికైన తెలంగాణ కు హరితహారం స్పూర్తితో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పర్యావరణ సమతుల్యత జరగాంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటే కార్యక్రమం గొప్పదని , గ్రీన్ చాలెంజ్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.