గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన పెద్దపల్లి జాయింట్ కలెక్టర్

307
jc Peddapalli
- Advertisement -

రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుంది. తాజాగా ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, జాయింట్ కలెక్టర్ వనజాదేవి. ఈసందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అందరూ ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోనవలసిందిగా తెలిపారు.

రాష్ట్రం లో పచ్చదనం పెంపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖులు, ఉన్నతాధికారులు మొక్కలు నాటే ప్రజలకు ఆదర్శంగా నిలవాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

మొక్కలు నాటిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, ఐఎంఎఫ్, పెద్ద పల్లి అధ్యక్షుడు మల్లెశం, పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లా రెడ్డి లను గ్రీన్ చాలెంజ్ స్వీకరించవలసిందిగా కోరారు.

jc 2

- Advertisement -