త్వరలో లబ్దిదారులకు డుబుల్ బెడ్ రూం ఇళ్లు

370
Harish Rao
- Advertisement -

సిద్దిపేట జిల్లాలో అర్హులకు త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట పట్టణ నిరుపేదల సొంతింటి కల నెరవేరిచే సంకల్పం తో నర్సపూర్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి దశలో ఉన్న నేపథ్యంలో లో హైదరాబాద్ అరణ్య భవన్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి , మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సెలక్షన్ కమిటీ సభ్యులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలకు , అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇల్లు ఎంపిక చేయాలని ఆదేశించారు.. దరఖాస్తు చేసిన వారిలో అర్హత లేని వారిని గుర్తించాలన్నారు. పట్టణము లో 11వేల 657 దరఖాస్తులు వచ్చాయని అధికారులు మంత్రి కి వివరించారు.11వేల 657 దరఖాస్తుల్లో నిజమైన లబ్ది దారులకె దక్కే విధంగా చూడాలన్నారు. గతంలో ఆయా పథకాల ద్వారా ఇల్లు పొందిన వారిని , ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన వారిని గుర్తించాలన్నారు.అదేవిధంగా సొంతంగా స్థలాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉంటే వారిని అనర్హుల జాబితాలోకి చేర్చాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్రూం ఇల్లు నిరుపేదలకె దక్కాలని , ఈ విషయంలో ఏలాంటి రాజకీయ జోక్యం ఉండదు అని చెప్పారు..ఎంపిక వేగవంతంగా చేపట్టాలని సూచించారు.

రెండు పడకల ఇళ్ల కేటాయింపుల కోసం అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ రూపొందించిన సమగ్ర వేదికను వినియోగించుకోవాలని ఎంపిక కమిటి సభ్యులకు సూచించారు. సిద్దిపేట మున్సిపాలిటీ లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఈ సమాచారం తో బేరీజు చేసుకొని ఎంపిక చేయాలని కలెక్టర్ వెంకటామరెడ్డిని ఆదేశించారు.. ఈ సమాచారం తో పాటు క్షేత్ర స్థాయిలో పరిశీలిన జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ టి ఎస్ ఎండి వేంకటేశ్వర్లు, జిల్లా అధికారులు శ్రవణ్, చరణ్ దాస్ , ఎస్ ఈ విద్యుత్ కరుణాకర్ ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మన్ తదితరులు ఉన్నారు ..

- Advertisement -