సూర్యపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామిజాతరకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఏపీ,ఛత్తీస్‌గఢ్,జార్ఖండ్,మహారాష్ట్ర,ఒడిశా రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులతో పెద్దగట్టు జనసంద్రంగా మారింది. లింగో …..ఓ లింగో…. అంటూ శివనమస్మరణ తో మార్మోగిపోయింది పెద్దగట్టు క్షేత్రం… ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. లింగమంతుల జాతరకు వందేళ్ల చరిత్ర ఉందన్నారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపిన జగదీశ్ రెడ్డి పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నామన్నారు. కెసిఆర్ పాలనలో పెద్దగట్టుకు మెట్ల నిర్మాణం, శాశ్వత మరుగుదొడ్లు నిర్మించామని పేర్కొన్నారు. ప్రతి భక్తునికి మిషన్ భగీరథ నీళ్లు అందించామని వెల్లడించారు.
లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు లింగమంతుల స్వామికి బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు.పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. దాదాపుగా 1800 మంది సిబ్బంది,సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.1800 మంది సిబ్బంది, 100 cc కెమెరా లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం 10 కోట్లతో ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం.