శ్రేయాస్ అయ్యర్..చెత్త రికార్డు!

2
- Advertisement -

ఐర్లాండ్ జట్టు తొలి టీ20 విజయాన్ని నమోదుచేసింది. భారత్ తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టులో లోర్కాన్ టక్కర్ 50 పరుగులు, గారెత్ డెలానీ 49 పరుగులు చేయడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తుందని చాలా మంది భావించినప్పటి ఐర్లాండ్ జట్టు…. భారత జట్టుకు షాక్ ఇస్తూ 148 పరుగులకే ఆలౌట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రేయాస్ అయ్యర్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్ ఇదే.

కెప్టెన్‌గా తన తొలి టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడం ద్వారా టీ20 జట్టుకు సారథ్యం వహించిన మొదటి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన భారత కెప్టెన్ల జాబితాలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, మరియు రిషబ్ పంత్‌ల సరసన శ్రేయాస్ అయ్యర్ కూడా చేరాడు. మ్యాచ్‌ మంచి ఆరంభం లభించినప్పటికీ మధ్య ఓవర్లలో బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యారని దీంతో మ్యాచ్ తమ చేజారిపోయిందని అన్నాడు.

Also Read:ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’

తొలి టీ20 మ్యాచ్‌లోనే ఓటమి పాలైన భారత కెప్టెన్లు:

విరాట్ కోహ్లీ – ఇంగ్లాండ్‌పై (కాన్పూర్, 2017)

రిషబ్ పంత్ – దక్షిణాఫ్రికాపై (ఢిల్లీ, 2022)

శుభ్‌మన్ గిల్ – జింబాబ్వేపై (హరారే, 2024)

శ్రేయాస్ అయ్యర్ – ఐర్లాండ్‌పై (బెల్ఫాస్ట్, 2026)

- Advertisement -