కేటీఆర్ జిల్లాల టూర్..బీఆర్ఎస్‌లో జోష్

3
- Advertisement -

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల అనంతరం క్యాడర్‌ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 90 శాతానికి పైగా నియోజకవర్గాల్లో పర్యటనలను విజయవంతంగా పూర్తి చేసిన కేటీఆర్.. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు.

అన్ని జిల్లాల్లో నిరంతరం పర్యటిస్తూ, క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా మమేకమవుతుండటం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ధైర్యాన్ని ఇస్తోంది. ముఖ్యంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఎస్ఐఆర్’ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆయన నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయించేలా వ్యూహాలను రచిస్తూ క్యాడర్‌లో సరికొత్త జోష్ నింపుతున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్ ఈరోజు (శనివారం) మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు స్థానిక పీ ఎస్ వై (PSY) కన్వెన్షన్‌లో జరిగే ‘బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి’ ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ఈ కీలక సమావేశంలో మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొననున్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ‘ఎస్ఐఆర్’ సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయడం, స్థానిక ప్రజా సమస్యలపై పోరాటాల కార్యాచరణను సిద్ధం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పట్టును మరింత బలోపేతం చేయాలని గులాబీ దళం భావిస్తోంది.

Also Read:ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’

- Advertisement -